ఒంగోలులో పేదలకు దొంగ పట్టాలు.. ఎమ్మెల్యే బాలినేని రియాక్షన్ ఇదే.... !

by srinivas |
ఒంగోలులో పేదలకు దొంగ పట్టాలు.. ఎమ్మెల్యే బాలినేని రియాక్షన్ ఇదే.... !
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలులో 24 వేలకు పైగా పేద లబ్ధిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అధ్వర్యంలో సీఎం జగన్ చేతులు మీదుగా అర్హులందరూ ఇళ్ల పట్టాలు అందుకున్నారు. అయితే అవి ఫేక్ ఇళ్ల పట్టాలుగా ప్రచారం జరిగింది. దీంతో పేదలకు దొంగ పట్టాలు ఇచ్చి మోసం చేశారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు. అయితే ఈ పత్రిపక్ష నాయకుల విమర్శలపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పేదలకు ఇచ్చిన పట్టాలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవి దొంగ పట్టాలు అని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఇంకెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని ప్రతిపక్ష నేతలకు బాలినేని ఛాలెంజ్ చేశారు.Next Story

Most Viewed