కనిగిరి వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి భారీగా వలసలు

by Disha Web Desk 16 |
కనిగిరి వైసీపీకి భారీ షాక్.. టీడీపీలోకి భారీగా వలసలు
X

దిశ, కనిగిరి: టీడీపీకి బీసీలే వెన్నుముక అని కనిగిరి టిడిపి ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. బీసీలకు రాజకీయ చైతన్యం కల్పించిన ఘనత తమ పార్టీకి దక్కుతుందని ఆయన తెలిపారు. పామూరు మండలం తిరగళ్లదిన్నెలో బలమైన సామాజిక వర్గానికి చెందిన మల్లె బోయిన బాల బ్రహ్మయ్య, మాజీ సర్పంచ్ గురుబ్రహ్మం ఆధ్వర్యంలో 90 బీసీ కుటుంబాలు టీడీపీలో చేరారు. వీరికి డాక్టర్ ఉగ్ర సమక్షంలో పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పామూరు వడ్డెపాలేనికి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ నేత బత్తిన సత్యనారాయణ ఆధ్వర్యంలో వీరంతా పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు ఆవుల రమణమ్మ, పువ్వాడి వెంకటేశ్వర్లు, కౌలూరి ఖాజారహంతుల్లా, ఎం గంగరాజు యాదవ్, జనసేన నాయకులు రహీముల్లా, జనసేన కార్యకర్తలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Next Story

Most Viewed