Erragondapalem: హోటళ్లలో భోజనం చేస్తున్నారా..?.. మీకు ఈ విషయం తెలుసా?

by Disha Web Desk 16 |
Erragondapalem: హోటళ్లలో భోజనం చేస్తున్నారా..?.. మీకు ఈ విషయం తెలుసా?
X
  • అపరిశుభ్రంగానే ఆహార పదార్థాలు
  • ప్రమాదకరంగా హోటల్ల నిర్వహణ
  • కల్తీ ఆయిల్‌తో భోజన పదార్థాలు

దిశ, ఎర్రగొండపాలెం: ఎర్రగొండపాలెంలో 'అన్ని భోజనం, టిఫిన్ హోటళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఆహార పాత్రలు సరిగా కడగటంలేదు. ప్రతి హోటల్లో దారుణమైన దుర్వాసన వస్తుంది. నాణ్యత ఉండదు. పుచ్చిపోయిన కూరగాయలు. పాడైపోయిన చికెన్. కల్తీ ఆయిల్‌తో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు.' అని స్థానిక, పరిసర ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లలో 'ఎలుకలు, పందికొక్కులు, బల్లులు, కుక్కలు ఎంగిలి ప్లేట్లను నాకుతూ ఉంటాయి. తినే ప్లేట్లు గ్లాసులపై ఈగలు, దోమలువాలి.' అనేక రకమైన అంటువ్యాధులకు కారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎర్రగొండపాలెం కొలుకుల, త్రిపురాంతకం, మాచర్ల రోడ్డు, ఎర్రగొండపాలెం శివారులో నిర్వహిస్తున్న రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి దుర్గంధం వస్తోందని చెబుతున్నారు. ఇక్కడ ఎవరికి కూడా ఎలాంటి అనుమతులు లేవని, ప్రకాశం జిల్లాకు చివరి ప్రాంతం కావడంతో అధికారులు కూడా పట్టించుకోరని, అందువల్ల రెస్టారెంట్లు, హోటళ్లు శుచి, శుభ్రతపై దృష్టి పెట్టవనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ఇష్టానుసారంగా ఆహార పదార్థాలు తయారు చేస్తుండటంతో రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలుషిత ఆహారాన్ని విక్రయిస్తున్న హోటల్, టిఫిన్ సెంటర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed