అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మి దుర్గ

by Ajay Maddhiboyina |

వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు భార్య అనంత ల‌క్ష్మి దుర్గ అజ్ఞాతంలోకి వెళ్లారు. వీధి సుబ్ర‌మ‌ణ్యం హ‌త్య కేసులో అడిష‌న‌ల్ ఛార్జ్ షీట్‌లో లక్ష్మి దుర్గ పేరు ఏ2గా ఉంది. పోలీసులు ఆమె కోసం వెతుకుతుండటంతో దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు.

అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మి దుర్గ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు భార్య అనంత ల‌క్ష్మి దుర్గ అజ్ఞాతంలోకి వెళ్లారు. వీధి సుబ్ర‌మ‌ణ్యం హ‌త్య కేసులో అడిష‌న‌ల్ ఛార్జ్ షీట్‌లో లక్ష్మి దుర్గ పేరు ఏ2గా ఉంది. పోలీసులు ఆమె కోసం వెతుకుతుండటంతో దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు. లక్ష్మి దుర్గ కాకినాడ శ్రీరామ్ నగర్ టవర్స్ లోని 4వ అంతస్తులో సత్య ఉదయ్ భాస్కర్ ఫ్లాట్‌లో నివాసం ఉంంటున్నారు. అయితే రెండు నెలలుగా లక్ష్మి దుర్గ అపార్ట్‌మెంట్‌కు రావడంలేదని వాచ్ మెన్ చెబుతున్నారు. ఇప్పటికే ఆమె ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు జరుపుతున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని అనంతబాబు నేరుగా వారి ఇంటికి తీసుకెళ్లి అప్పగించారు. ఈ కేసులో అనంతబాబును పోలీసులు ఏ1గా చేర్చారు. అయితే ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మి దుర్గ కూడా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భార్య భర్తలు ఇద్దరూ కలిసి హత్య చేశారని పోలీసులు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో అనంతలక్ష్మిని కావాలనే కేసు నుండి తప్పించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Next Story