మాచర్లలో మాస్ పోరు..డబుల్ హ్యాట్రిక్‌పై పిన్నెల్లి గురి!

by Disha Web Desk 18 |
మాచర్లలో మాస్ పోరు..డబుల్ హ్యాట్రిక్‌పై పిన్నెల్లి గురి!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్నీ పార్టీలు ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ కూడా ఏపీ ప్రజల్లో నెలకొంది. నామినేషన్లు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే..ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య టప్‌ఫైట్ ఉంది. పల్నాడు జిల్లాలో హాట్‌సీటు మాచర్ల. ఈ ఐదేళ్లలో టీడీపీ, వైసీపీ వర్గ పోరుతో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతమిది. కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ మూడు సార్లు, స్వతంత్రులు, సీపీఐ ఒకసారి గెలిచాయి. 2004 నుంచి గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీ మరోసారి వైసీపీ రంగంలోకి దింపింది. ఈయనను ధీటుగా ఎదుర్కొనేందుకు మాస్ లీడర్ జూలకంటి బ్రహ్మారెడ్డిని టీడీపీ బరిలో నిలిపింది.

Next Story