సైకో రెడ్డి పాలనలో దేవుడిని దర్శించుకునే స్వేచ్ఛ కూడా ప్రజలకు లేదా?: యనమల రామకృష్ణుడు

by Seetharam |
సైకో రెడ్డి పాలనలో దేవుడిని దర్శించుకునే స్వేచ్ఛ కూడా ప్రజలకు లేదా?: యనమల రామకృష్ణుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల హౌజ్ అరెస్టులు చేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని టీడీపీ శాసనమండలి పక్ష నేత, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. మత విశ్వాసాలను అవమానించే చర్య అని అభిప్రాయపడ్డారు. స్కిల్ స్కామ్ కేసు నుంచి చంద్రబాబు నిర్ధోషిగా బయటకు రావాలని దేవాలయాలు, మసీదులు, చర్చల్లో ప్రార్థించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవడం జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. ‘సైకో రెడ్డి పాలనలో దేవుడిని దర్శించుకునే స్వేచ్ఛ కూడా ప్రజలకు లేదా? ప్రజల మనిషి చంద్రబాబుపై జగన్ రెడ్డి కక్ష కట్టాడు. అక్రమ కేసులు బనాయించి జైలు పాల్జేశాడు. శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించే హక్కు కూడా ప్రజలకు లేదంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు? విజయవాడ, గుంటూరు, ఉభయగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడం దుర్మార్గం. ఇది పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది’ అని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దేనికి సంకేతం? అధికార పార్టీకి ఒక రూలు ప్రతిపక్షాలకు మరో రూలా? రాష్ట్రమంతా పోలీస్ చట్టం ఉంటే ముఖ్యమంత్రి తిరుపతిలో సభ ఎలా పెట్టారో పోలీసులు సమాధానం చెప్పాలి అని నిలదీశారు. టీడీపీ నేతలు ఎక్కడైనా విధ్వంసాలకు, చట్ట వ్యతిరేకం కార్యాకలాపాలకు పాల్పడ్డారా.? అని ప్రశ్నించారు. పోలీసులు కూడా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దులు దాటి అణచివేతకు గురిచేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా రాజారెడ్డి రాజ్యాంగాన్నే అమలు చేస్తామంటే కుదరదు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. టీడీపీ నేతలను గృహ నిర్భంధాలు చేయడం ఇకనైనా మానుకోవాలి అని యనమల రామకృష్ణుడు సూచించారు.

Next Story