రాత్రి అయినా పెన్షన్ల పంపిణీ.. 25 లక్షల మందికి పైగా నగదు అందజేత

by srinivas |
రాత్రి అయినా పెన్షన్ల పంపిణీ.. 25 లక్షల మందికి పైగా నగదు అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రాత్రి అయినా పెన్షన్లు కొనసాగుతున్నాయి. పింఛన్ దారులకు పంపిణీ చేసేందుకు రూ.1,951 కోట్లను ప్రభుత్వం రెడీ చేసింది. దాదాపు 13, 669 సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గురువారం సైతం పెన్షన్లు అందించనున్నారు. తొలి రోజు (బుధవారం) 25 లక్షల 66 వేల మంది లబ్ధిదారులకు పింఛన్ నగదు అందజేశారు. ఎన్నికల సంఘం ఆంక్షలతో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లు దూరమయ్యారు. దీంతో గ్రామ సచివాలయాల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కిడ్నీ డయాలసిస్ బాధితులకు పెన్షన్ నగదు అందజేస్తున్నారు. ఒక్కసారిగా సచివాలయాలకు భారీగా పింఛన్ దారులు తరలిరావడం, సరైన సౌకర్యాలు లేకపోవడంతో, పైగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పలువురు వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ముగ్గురు వృద్ధులు మృతి చెందారు.



Next Story

Most Viewed