‘నేను అస్సలు ఎంకరేజ్ చేయ్యను’.. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ స్వీట్ వార్నింగ్

by Satheesh |
‘నేను అస్సలు ఎంకరేజ్ చేయ్యను’.. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ స్వీట్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 20 మంది జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను జనసేన పక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జనసేనాని మాట్లాడుతూ.. పాతతరం రాజకీయాలకు కాల చెల్లిందని, అప్పటిలాగా కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామంటే కుదరని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల్లో మనకు ఎంత మద్దతిచ్చారో.. వారి కోసం వస్తే అంతే బలంగా నిలదీయగలరని అన్నారు. ప్రజలు ఏదైనా సందర్భంలో ఓ మాట అన్నా భరించాలని.. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చెయొద్దని సూచించారు. ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

ఎమ్మెల్యేలతో తరుచు సమావేశమవుతానని, కూటమిలోని మిత్రపక్షాలతో వెళ్తూనే.. మనం ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చకోవాలని చెప్పారు. జనం మనల్ని నమ్మడం వల్లే ఈ స్థాయి విజయం దక్కిందన్నారు. వైసీపీ నేతలపై కక్ష సాధింపునకు ఇది సమయం కాదని, గతంలో వాళ్లు చేశారు కాబట్టి.. మనం అలా చేయాలని అనుకోవద్దని సూచించారు. కక్ష సాధింపు చర్యలను తాను ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయ్యనని పవన్ తేల్చి చెప్పారు. దేశంలోనే 100 శాతం స్ట్రైక్ రేట్ రికార్డ్ మనకే వచ్చిందని.. దానని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కాగా, పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించి 100 పర్సంట్ స్ట్రైక్ రేట్ రికార్డ్ నమోదు చేశారు.

Next Story

Most Viewed