ఇంద్రకీలాద్రికి ''వారాహి''.. తొలిసారి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వనుండటంతో తీవ్ర ఉత్కంఠ!

by Disha Web |
ఇంద్రకీలాద్రికి వారాహి.. తొలిసారి ఏపీలోకి ఎంట్రీ ఇవ్వనుండటంతో తీవ్ర ఉత్కంఠ!
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజన్న ఆలయంలో పూజలు అందుకున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి.. బుధవారం విజయవాడలోని దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు అందుకోనుంది. ఈ మేరకు జనసేన పార్టీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి బుధవారం ఉదయం 8 గంటలకు పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ విజయవాడలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. మంగళవారం కొండగట్టులో పూజల అనంతరం పవన్ కల్యాణ్ నేరుగా విజయవాడకు బయలుదేరారని ప్రకటనలో వెల్లడించారు. అయితే, పవన్ ఎన్నికల ప్రచార రథం వారాహి తొలిసారిగా ఏపీకి వెళ్లనుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


Next Story