Pawan Kalyan : పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ అసహనం

by M.Rajitha |
Pawan Kalyan : పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ అసహనం
X

దిశ, వెబ్ డెస్క్: పోలీసుల నిర్లక్ష్య ధోరణిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) మండిపడ్డారు. రోడ్డు ప్రమాదాల్లో పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయానికి బాధితులకు సహాయం అందించకపోతే వారు విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. పోలీసులు బాధ్యతగా పనిచేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. కాకినాడలో జరిగిన ప్రమాదంలోని మృతుల కుటుంబాలను శనివారం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబాలు పవన్ దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని పవన్ కళ్యాణ్ అందించారు.

Advertisement

Next Story