- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ ఎజెండా మోస్తున్నారు.. సీపీఐ నేత రామకృష్ణ హాట్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయి బీజేపీ ఎజెండా మోస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ (CPI Leader Ramakrishna) ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు (Wakf Board Amendament Bill) ఆమోదం పొందడంపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బిల్లుకు మద్దతు తెలిపిన ఏపీ నాయకులపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నేత మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అంశంలో టీడీపీ (TDP) వాళ్లు కొన్ని సవరణలు చేశామని చెప్పారని, మరి వారి సవరణలు ఆమోదం కానప్పుడు బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
అంతేగాక పవన్ కళ్యాణ్ తో పోలిస్తే చంద్రబాబు కొంతమేర నయమేనని, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం (Deputy CM) అయ్యాక పూర్తిగా మారిపోయాడని అన్నారు. కాషాయ బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని పూర్తిగా సనాతన వాదిలా మారిపోయాడని, ఆయన బీజేపీ ఎజెండాను (BJP Ajenda) మోస్తున్నాడని హాట్ కామెంట్స్ చేశారు. ఆయన సనాతని అనిపించుకోవడానికి క్రిస్టియన్ అయిన తన భార్య చేత తిరుమలలో గుండు కొట్టించాడని, అది ఆయన వ్యక్తిగతం అయినప్పటికీ మాట్లాడక తప్పట్లేదని చెప్పారు. ఇక టీటీడీ బోర్డు (TTD Board)లో మనం వేరే వాళ్లను తీసుకోవడం లేదు కదా.. వక్ఫ్ బోర్డులో కూడా వేరే మతస్థులకు స్థానం ఉండకూడదని చంద్రబాబు క్లియర్ గా చెప్పారని, మరి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.