టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్‌లో బిగ్ ట్విస్ట్.. తొలి జాబితాలో పవన్‌కు దక్కని చోటు

by Disha Web Desk 19 |
టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్‌లో బిగ్ ట్విస్ట్.. తొలి జాబితాలో పవన్‌కు దక్కని చోటు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యింది. 118 మంది పేర్లతో శనివారం ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్, బాబు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 118 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి 94, జనసేనకు 24 సీట్లు ఫిక్స్ అయ్యాయి. జనసేనకు మూడు పార్లమెంట్ సీట్లను సైతం ఖరారు చేశారు. జనసేనకు కేటాయించిన 24 సీట్లలో కేవలం ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మిగిలిన 19 మంది పేర్లను అనౌన్స్ చేయలేదు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా పూర్తికాకపోవడంతో పేర్లను ప్రకటించనట్లు తెలుస్తోంది.

అయితే, ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జనసేన ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల జాబితాలోనూ ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పేరు లేదు. తెనాలి-నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల - లోకం మాధవి, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, రాజానగరం-బత్తుల బలరామ కృష్ణ, కాకినాడ రూరల్- పంతం నానాజీల పేర్లు మాత్రమే కన్ఫామ్ అయ్యాయి. గత ఎన్నికల్లో ఓటమి పాలైన భీమవరం నుండి పవన్ కల్యాణ్ మరోసారి పోటీ చేస్తారని మొదటి నుండి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా ఇటీవల పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించి స్థానిక నేతలతో భేటీ అయ్యారు. దీంతో పవన్ మరోసారి భీమవరం నుండి పోటీ చేయడం ఫిక్స్ అని వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ ప్రకటించిన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌లో పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం అటు జనసేనతో ఏపీ పాలిటిక్స్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ పోటీ‌పై ఇంకా స్పష్టమైన అవగాహనకి రాకపోవడంతోనే లిస్ట్‌లో ఆయన పేరు లేనట్లు తెలుస్తోంది. భీమవరం కాకుండా మరేదైనా స్థానం నుండి బరిలోకి దిగాలని పవన్ ప్లాన్ చేస్తున్నారా అనే కొత్త చర్చకు తెరపైకి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఫస్ట్ లిస్ట్‌లో జనసేనాని పోటీ చేసే స్థానంపై క్లారిటీ రాకపోవడంతో జనసైనికులు ఒకింత నిరాకకు గురి అయ్యారు. అయితే, మరో రెండు రోజుల్లో మిగిలిన స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఈ జాబితాలో పవన్ కల్యాణ్ పేరు ఉంటుందని పేర్కొన్నారు.

Read More..

జనసేన మొదటి విడత అభ్యర్థులు వీరే

ప్రజాశాంతి బెటర్.. జనసేన ఫస్ట్ లిస్ట్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్

Next Story

Most Viewed