సీబీఎన్ ను సీఎం చెయ్యడానికి సిద్ధంగా లేము..దానికే మా ఓటు..పవన్ ఫ్యాన్

by Disha Web Desk 3 |
సీబీఎన్ ను సీఎం చెయ్యడానికి సిద్ధంగా లేము..దానికే మా ఓటు..పవన్ ఫ్యాన్
X

దిశ డైనమిక్ బ్యూరో: శాంతి అనే మహిళకు ఈ రోజు తెల్లవారు జామున పురిటినొప్పులు వచ్చాయి. అయితే ఆ ప్రాంతంలో రోడ్డు మార్గం లేకపోవడంతో.. ఆ ప్రాంతం నుండి నాలుగు కిలో మీటర్లు డోలీలో ఆ మహిళను మోసుకుంటూ వెళ్లారు. అనంతరం అక్కడ నుండి ఆ మహిళను బుచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. మహిళను అక్కడ నుండి రోలుగుంట తీసుకెళ్లారు.

దీనితో ఇంకా ఎన్నేళ్లు ఈ ఇబ్బందులను ఎదుర్కోవాలని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. కాగా నెలకి రూ/ 3.83 కోట్ల వ్యయంతో జగన్ పర్యటన కోసం రెండు హెలీకాఫ్టర్లను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మూడు నెలలు సీఎం గా కొనసాగనున్న జగన్ కోసం తీసుకున్న హెలికాఫ్టర్ల అద్దె మాత్రమే రూ/ 3.83 కోట్లు. ఇక పైన ఖర్చులు చాలానే ఉన్నాయని తెలియచేస్తూ ఓ వీడియోని జనసేన పార్టీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఆ వీడియోకి సామాన్యుల కష్టాలు.. జగన్ విలాసాలు అనే కాప్షన్ ను ట్యాగ్ చేసింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు. అయితే పవన్ అభిమాని అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి.. పవన్ కళ్యాణ్ న్నీ ఉద్దేశిస్తూ.. సీబీఎం ను సీఎం చెయ్యటానికి మేము సిద్ధంగా లేము అన్న నీలా.. నోటాకి వేసుకుంటాం. అని కామెంట్ చేశారు.


Next Story

Most Viewed