అభివృద్ది ఆయనకు, రాజకీయం ఈయనకు.. పరిటాల శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |
అభివృద్ది ఆయనకు, రాజకీయం ఈయనకు.. పరిటాల శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇవ్వాళ పెనుగొండ సభలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ పెనుగొండలో రా.. కదలిరా పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ది వైపే చూసే వాళ్లమని, రాజకీయం సాఫ్ట్ గా కొనసాగేదని అన్నారు.

కానీ, ఈ సారి టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ది రాజకీయం రెండు రైలు పట్టాల మాదిరి సమానంగా పరుగులు తీస్తాయని అన్నారు. అభివృద్ది ఎప్పటిలాగే చంద్రబాబు చేతిలో పెడతామని, కానీ రాజకీయం మాత్రం నారా లోకేశ్ చేతిలో పెడతామని హాట్ కామెంట్స్ చేశారు. పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ యువనేత నారా లోకేశ్ రాస్తున్న రెడ్ బుక్ దృష్టిలో పెట్టుకొని శ్రీరామ్ ఈ తరహ వ్యాఖ్యలు చేసి ఉంటాడని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.

Next Story