Breaking: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ?

by Disha Web Desk 16 |
Breaking: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధను బరిలో దింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ నెల 23న రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. 13 వరకు గడువుంది. ఈ నేపథ్యంలో పంచుమర్తి అనురాధ పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు 23 మంది ఉన్నారు. కానీ వీరిలో నలుగురు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. టీడీపీకి 19 ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా గెలవాలంటే 23 మంది ఓట్లు వేయాలి. అప్పుడు ఎమ్మెల్సీగా గెలుపొందుతారు.

అయితే ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్ వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. అయితే వీరి ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసే అవకాశం ఉంది. విప్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఈసీకి ఫిర్యాదు చేసే అవకాశమూ ఉంది. కాబట్టి వీరు టీడీపీకి ఓటు వేస్తారా లేదా అనే సందిగ్థం నెలకొంది. మరోవైపు వైసీపీ కూడా రెబెల్స్ బెడద ఉండనే ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పలువులు ఎమ్మెల్యేలు నుంచి కూడా వైసీపీకి అసంతృప్తుల బెడద ఉంది. ఈ నేపథ్యంలో మరి వీరి ఓట్లు ఎవరికి వేస్తారో చూడాలి.

Next Story