- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సముద్రంలో 61 రోజులు చేపల వేట నిషేధం.. ఆదేశాలు జారీ చేసిన అధికారులు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత (Coastal area) ప్రజలు అధికంగా చేపల వేట (fishing)పై ఆధారపడి జీవిస్తున్నారు. వీరు సముద్రంలో వివిధ రకాల చేపల వేటను కొనసాగిస్తూ.. తమ ఉపాధి పొందుతున్నారు. అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా చేపల వేట చాలా సులభం అయింది. దీంతో ప్రతి రోజు పెద్ద మొత్తంలో చేపలు పట్టి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ చేపల వేట కూడా కమర్షియల్ కావడంతో భారీ బోట్లను ఉపయోగించి టన్నుల కొద్ది చేపలను గంటల వ్యవధిలో పడుతున్నారు. దీంతో సముద్ర తీరంలో చేపలు క్రమం క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ కారణంగా చేపల లభ్యం కూడా తగ్గడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రతి సంవత్సరం సముద్రంలో చేపల ప్రత్యుత్పత్తి జరిగే సమయంలో (Fish reproduction time) చేపల వేట నిషేదిస్తూ (Fishing ban) వస్తున్నారు. ఇది అనేక సంవత్సరాలుగా అనవాయితీగా వస్తుంది.
అయితే కొందరు వ్యాపరస్తులు.. తమ స్వలాభం కోసం గుట్టు చప్పుడు కాకుండా బోట్లతో వెళ్లి చేపలను పట్టేవారు. దీంతో నేరుగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. సముద్రంలో చేపల ప్రత్యుత్పత్తి జరిగే 61 రోజుల పాటు వేటకు వెళ్లకుండా సముద్ర తీరంలో నిషేధం విధించింది. ఈ మేరకు అధికారులు తాజాగా జీవోను విడుదల చేశారు. అయితే ఈ రెండు నెలల పాటు మత్య్సకారులకు జీవనోపాధి కోసం కుటుంబానికి రూ. 10 చోప్పు అందజేయనున్నారు. కాగా చేపల వేట నిషేదంలో ఈ సారి సంప్రదాయ బోట్లకు మినహాయింపు కల్పించారు. మరబోట్లు, మెకనైజ్డ్, మోటార్ బోట్లతో చేపల వేట చేయరాదని అధికారులు తెలిపారు. అలాగే నిబంధనలను ఉల్లఘించి ఎవరైన చేపల వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని, బోట్ల లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.