ఆయన నాయకత్వంలోనే దేశాభివృద్ధి : గుత్తా

by Disha Web Desk 18 |
ఆయన నాయకత్వంలోనే దేశాభివృద్ధి : గుత్తా
X

దిశ గంగాధర నెల్లూరు:ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే భారతదేశం అభివృద్ధి చెందుతోందని పెనుమూరు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గుత్తా వాసుదేవనాయుడు తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా రూ. 41 వేల కోట్లతో 554 రైల్వే స్టేషన్ లు పునరాభివృద్ధి చెందాయి అన్నారు. అలాగే 1,500 జాతీయ రహదారుల్లో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం జరిగిందని చెప్పారు. సోమవారం పెనుమూరు క్రాస్ వద్ద రూ.3 కోట్ల తో నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జిని ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి జీకే చౌదరి, పూతలపట్టు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు నరసింహ నాయుడు, రైల్వే అధికారులు మధుసూదన్, వేణుమాధవ్, ఉదయ రామ సింగ్ , కోటేశ్వర రావు, శ్రీనివాసులు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed