సీఎం జగన్ దాడిపై నారా లోకేష్ సంచలన ట్వీట్

by Mahesh |
సీఎం జగన్ దాడిపై నారా లోకేష్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, సీఎం జగన్ పై శనివారం రాత్రి రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి అనంతరం బస్సులోనే ప్రథమ చికిత్స చేయించుకున్న జగన్ వెంటనే యాత్రను కొనాసాగించారు. ఈ దాడిపై నారా లోకేష్ జగన్ పై సెటైరికల్ గా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో.. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్..? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్! అంటూ రాసుకొచ్చారు. 2019 లో కోడి కత్తి, 2024 లో రాయి అని వాటి ఫొటోలను షేర్ చేస్తూ.. జగన్ తనపై తానే దాడి చేయించుకున్నాడనే అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కాగా ఎన్నికల సమయంలో జగన్ పై దాడి సంచలనంగా మారగా.. ప్రస్తుతం లోక్ ట్వీట్ మరింత సంచలనంగా మారింది. కాగా ఈ ఘటనపై స్పందించిన ఈసీ 24 గంటల్లోపు పుర్తి సమాచారం అందించాలని, నిందితులను గుర్తించాలని పోలీసులను ఆదేశించింది.

Advertisement

Next Story