ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. ‘ఆధారాలతో కేసు వేసి విచారణ జరిపిస్తా’: నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

by Anjali |
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. ‘ఆధారాలతో కేసు వేసి విచారణ జరిపిస్తా’: నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏపీలో కొత్త కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కాగా ఏపీలో ముఖ్యమంత్రితో కలిసి 26 మందికి మంత్రివర్గంలో చోటు దక్కేందుకు వీలుంది. అయితే కూటమి నుంచి 164 మంది ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో ఎవరెవరికి మంత్రిపదవులు దక్కుతాయనే రాష్ట్ర పాటిటిక్స్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు మంత్రివర్గంలో నారా లోకేష్ పేరు కూడా ఉందని టాక్ వినిపిస్తుంది. ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు కేటాయిస్తారని సమాచారం. ఇకపోతే ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాజాగా నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేసు వేసి విచారణ జరిపిస్తానని అన్నారు. పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై తమ దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.



Next Story

Most Viewed