నారా లోకేశ్‌పై కేసు.. వచ్చే నెల 15కు విచారణ వాయిదా

by Disha Web Desk 16 |
నారా లోకేశ్‌పై కేసు.. వచ్చే నెల 15కు విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: తమను వేధించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని, వారి వివరాలను రెడ్ బుక్‌లో నమోదు చేశామని యువగళం పాదయాత్రతో పాటు చాలా సభల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో రెడ్ బుక్ పేరుతో నారా లోకేశ్ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ఏసీబీ కోర్టు లోకేశ్‌ను విచారించాలని సీఐడీకి సూచనలు చేసింది. ఈ మేరకు లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసింది. అయితే సీఆర్పీసీ సెక్షన్ 41 (ఏ) నిబంధనలను ఉల్లంఘించారని సీఐడీ ఆరోపించింది. అంతేకాదు ఈ కారణంతోనే లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో గురువారం లోకేశ్ తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఏప్రిల్ 15న ఇరువర్గాల వాదనలు వింటామని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.


Next Story

Most Viewed