మీడియా లక్ష్యంగా సైకో జగన్ కాలకేయ సైన్యం దాడులు: నారా లోకేష్ ఫైర్

by Disha Web Desk 19 |
మీడియా లక్ష్యంగా సైకో జగన్ కాలకేయ సైన్యం దాడులు: నారా లోకేష్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థలు, జర్నలిస్టులపై వరుస దాడులు హాట్ టాపిక్‌గా మారాయి. రెండు రోజుల క్రితం ఓ పత్రికకు చెందిన జర్నలిస్ట్‌పై కొందరు వ్యక్తులు విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన మురువక ముందే.. తాజాగా ఇవాళ కర్నూల్‌లోని ఓ పత్రిక కార్యాలయంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడులపై తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సైకో జగన్ కాలకేయ సైన్యం మీడియా లక్ష్యంగా దాడులు చేస్తోందని మండిపడ్డారు. రాప్తాడు వైసీపీ సభలో ఓ పత్రిక ఫొటో జర్నలిస్ట్‌ను హత్య చేసేందుకు యత్నించారు.. ఇవాళ కర్నూల్‌లోని ఈనాడు ఆఫీస్‌పైకి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి రౌడీమూకల్ని వదిలారని అన్నారు. మీడియాపై వైసీపీ దాడులు ఆటవీక పాలనకు పరాకాష్ట అని విమర్శలు గుప్పించారు. మీడియాపై సైకో జగన్ ముఠా దాడుల్ని ఖండిస్తున్నానని అన్నారు.


Next Story

Most Viewed