chandrababu Arrest: ఢిల్లీలో లోకేశ్ ధర్నా.. కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్

by Disha Web Desk 16 |
chandrababu Arrest: ఢిల్లీలో లోకేశ్ ధర్నా.. కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నారా లోకేశ్ ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేలా పార్లమెంట్ భవనం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన తండ్రి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం, సీఐడీ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జగన్ రాక్షస క్రీడలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఏపీలో జరుగుతున్న అరాచక, విధ్వంసక పాలనపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed