మరింత స్పెషల్‌గా సంక్రాంతి.. ఒకేచోట నారా, నందమూరి కుటుంబసభ్యులు

by Disha Web Desk 2 |
మరింత స్పెషల్‌గా సంక్రాంతి.. ఒకేచోట నారా, నందమూరి కుటుంబసభ్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఎక్కడ స్థిరపడ్డా సంక్రాంతి వచ్చిందంటే చాలు సొంతూళ్లకు పయణమవుతుంటారు. కుటుంబమంతా ఒకేచోట ఏకమై ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. తాజాగా.. సంక్రాంతి సమీపిస్తోన్న నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నారా, నందమూరి కుటుంబాలు కలిసి ఒకేచోట పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. ఈనెల 13న టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెకు రెండు కుటుంబాలు వెళ్లనున్నాయి. దాదాపు మూడేళ్ల తర్వాత సొంతూరులో నారా ఫ్యామిలీ సంక్రాంతి సంబురాలు జరుపుకోవడం విశేషం. 13వ తేదీ నుంచి దాదాపు మూడు రోజులపాటు అక్కడే ఉండి పండుగ జరుపుకోనున్నారు. అయితే, ఈ పండక్కి జూనియర్ ఎన్టీఆర్ హాజరుపై సందిగ్ధత నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ పండక్కి హాజరైతే బాలకృష్ణ, చంద్రబాబు ముగ్గురు కలిసి రాజకీయ అంశాలూ మాట్లాడుకునే అవకాశం ఉండనుంది. మరి ఎన్టీఆర్ హాజరవుతారో లేదో చూడాలి.

Also Read...

చంద్రబాబు పవన్ భేటీ.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed