నగ్మా అనుమానాస్పదమృతి..చనిపోయిందనే విషయం దాచి..

by Disha Web Desk 21 |
నగ్మా అనుమానాస్పదమృతి..చనిపోయిందనే విషయం దాచి..
X

దిశ, డైనమిక్ బ్యూరో : దాల్ మిల్లులో ఆ మహిళ రోజువారి కూలీగా పనిచేస్తుంది.ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తోంది. అయితే శనివారం 7 గంటలు అయినా భార్య ఇంటికి రాకపోవడంతో భర్త కంపెనీ వద్దకు వెళ్లి నిలదీయగా ఎప్పుడో వెళ్లిపోయిందని యాజమాన్యం చెప్పింది. ఇంతలో ఆ కంపెనీలో పనిచేసే మరో ఉద్యోగి ఆమె చనిపోయిందని తెలిపాడు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి కంపెనీలోకి వెళ్లి చూడగా భార్య విగతజీవిగా పడి ఉంది. భార్య మృతదేహాన్ని చూసి భర్త, ఆమె ఇద్దరు ఆడపిల్లలు బోరున విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...బాలాజీ దాల్ మిల్లులో తలారి నగ్మా (30) పనిచేస్తుంది. అయితే రోజూ సాయంత్రం 5 గంటలకు మిల్లు నుంచి ఇంటికి తిరిగి వస్తుంది నగ్మా. అయితే శనివారంసాయంత్రం 7 గంటలు అయినా రాకపోవడంతో భర్త తలారి రఘుకు అనుమానం వచ్చింది. మిల్లు వద్దకు వెళ్లి తన భార్య ఇంటికి రాలేదని యాజమాన్యాన్ని అడిగాడు. మీ భార్య ఇంతకు మునిపే ఇంటికి వెళ్లిందని తెలిపారు. అయితే అనుమానం వచ్చి అక్కడే ఉన్న సిబ్బందిని అడగ్గా ‘మీ భార్య చనిపోయింది’ అని తెలిపారు. దీంతో భర్తతో పాటు వాళ్ళ బంధువులు మిల్లు వద్దకు వచ్చారు. అయితే లోపలికి వెళ్లకుండా యాజమాన్యం అడ్డుకున్నా గేట్‌ని తోచుకుంటూ లోపలికి వెళ్లి చూడగా తలారి నగ్మా విగత జీవిగా పడి ఉంది. దీంతో భర్త, ఇద్దరు పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. యాజమాన్యంపై తమకు అనుమానాలు ఉన్నాయని భర్త రఘు ఆరోపించారు. తాము కంపెనీలోకి రాగానే యాజమాన్యం దొడ్డిదారిన పారిపోయిందన్నారు. అంతేకాదు బాలాజీ దాల్ మిల్లు యాజమాన్యం అక్రమంగా 5 ఫ్యాక్టరీలునడుతుపుతుందని ఆరోపించారు.కనీసం ఫ్యాక్టరీ నేమ్ బోర్డులు కూడా లేవు. కార్మికులకు ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదని కానీ సెక్యూరిటీ కెమెరాలు అయితే ప్రతి చోటా అమర్చారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed