నాడు లగడపాటి.. నేడు ప్రశాంత్ కిశోర్.. మంత్రి అంబటి సెటైర్

by Ramesh Goud |   ( Updated:2024-03-03 16:40:03.0  )
నాడు లగడపాటి.. నేడు ప్రశాంత్ కిశోర్.. మంత్రి అంబటి సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ఎన్నికలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై ఏపీ వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. 2019 ఎన్నికలపై ప్రీ సర్వే చేసిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడని, ఇప్పడు ప్రశాంత్ కిషోర్ కూడా దానికి సిద్దంగా ఉన్నాడని కౌంటర్ ఇచ్చారు. " నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు! ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడు! " అని ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా హైదరాబాద్ లో జరిగిన ఓ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ ఏపీ ఎన్నికల్లో సీఎం జగన్ ఘోర పరాజయం చవి చూస్తాడని చెప్పారు. ప్రజల సొమ్ము పంచుతూ.. ప్రజల సంక్షేమం చూస్తున్నామనడం వల్ల రాజకీయంగా నష్టపోతున్నాడని అన్నారు. అంతేగాక ప్యాలెస్ లో కూర్చొని బటన్లు నొక్కితే ఓట్లు రాలవని హాట్ కామెంట్స్ చేశాడు.

Advertisement

Next Story