నా విద్యార్థులు, సన్నిహితులే నన్ను గెలిపించారు: ఎమ్మెల్సీ వేపాడ

by Disha Web Desk 23 |
నా విద్యార్థులు, సన్నిహితులే నన్ను గెలిపించారు: ఎమ్మెల్సీ వేపాడ
X

దిశ, ఉత్తరాంధ్ర: నా విద్యార్థులు గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి పని చేశారని, నాకు సహకరించిన నా మిత్రులను అనేక విధాలుగా వేధించారని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు అన్నారు. విశాఖలో టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో ఈ ఎన్నిక మంచి మార్పు అవుతుందని అందరూ భావించడంతో నా విజయం సాధ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో నాలాంటి వారు రాజకీయాలకు రావడానికి బాట పడిందన్నారు. విద్యావంతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగ, ఉపాధ్యాయులు సరైన సమయంలో జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. 34 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా గెలిపించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు, కేడర్ తన గెలుపునకు విశేష కృషి చేసిందన్నారు. అందరి సహకారంతో 30 రోజుల్లో 34 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story