జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన ఉపకారం.. ఎంపీ విజయసాయి రెడ్డి

by Dishafeatures2 |
జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన ఉపకారం.. ఎంపీ విజయసాయి రెడ్డి
X

దిశ ఏపీ బ్యూరో: జగన్ ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు మెరుగైన ఉపకారం లభించిందని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.48,899 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.15,589 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ. 33,625 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.12,487 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపారు. 2018-19లో జీతభత్యాల వ్యయం రూ.32,743 కోట్లు కాగా 2022-23 లో రూ.5,4768 కోట్లకు చేరిందని వివరించారు. ప్రక్క రాష్ట్రం తెలంగాణలో జీతభత్యాల వ్యయం రూ.29,682 కోట్లు మాత్రమేనని అన్నారు. టూరిజం హోటళ్లలో ఆయుర్వేద, యోగా సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హోటళ్లలో ఆయుర్వేద, యోగా సెంటర్లు ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి సూచించారు.


Next Story

Most Viewed