వెన్నుపోటు, అవినీతికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్: MP విజయసాయిరెడ్డి

by Disha Web Desk 19 |
వెన్నుపోటు, అవినీతికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్: MP విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, వెన్నుపోటుకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రంగా మారిందని ధ్వజమెత్తారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అన్ని ఆధారాలు చూసే కోర్టు చంద్రబాబుకు కస్టడీ విధించిందని తెలిపారు. టీడీపీ ఎంపీల అనుచిత ప్రవర్తన కారణంగానే రాజ్య సభలో చంద్రబాబు అవినీతిపై మాట్లాడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇక, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కనకమేడల మండిపడ్డారు. చైర్మన్ సభలోని లేని సమయలో.. సభను పక్క దారి పట్టించే విధంగా ఆయన మాట్లాడారని సీరియస్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించిన ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed