- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వెన్నుపోటు పొడిస్తే ఇంకా మంచి పదవి: చంద్రబాబుపై MP నాని హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం అటు టీడీపీ, ఇటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సారి కేశినేని నానికి ఎంపీ టికెట్ కట్ చేసిన చంద్రబాబు.. నాని సోదరుడు కేశినేని చిన్నికి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో కేశినేని ఫ్యామిలీ పాలిటిక్స్ రాజకీయ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ఈ క్రమంలో కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని.. వెన్నుపోటు పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నన్ను వద్దుకున్నారు.. కానీ నేను ఆయనను అనుకోలేదన్నారు. చంద్రబాబుతో రోజు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. గతంలో నామినేషన్ల చివరి వరకు టీడీపీ అభ్యర్థులను తేల్చేవారు కాదని, కానీ నా విషయంలోనే చంద్రబాబు ఇలా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. టీడీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసైనా గెలుస్తానని గతంలోనే చెప్పానని.. తానేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. కాగా, వెన్నుపోటు అంటూ కేశినేని చేసిన కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.