సీబీఐ విచారణకు MP అవినాష్ రెడ్డి.. CBI అధికారుల ప్రశ్నల వర్షం!

by Disha Web Desk 19 |
సీబీఐ విచారణకు MP అవినాష్ రెడ్డి.. CBI అధికారుల ప్రశ్నల వర్షం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ ఆయనను విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాల మేరకు నేడు సీబీఐ ముందు అవినాశ్ హాజరయ్యారు. అయితే వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే గత నెలలో విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా.. పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టి.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి:

టీడీపీ బలహీనతలే వైసీపీ బలం

Next Story