డిప్యూటీ సీఎం పవన్ భార్యపై ట్రోల్స్.. ఖండించిన ఎమ్మెల్సీ విజయశాంతి

by Mahesh |
డిప్యూటీ సీఎం పవన్ భార్యపై ట్రోల్స్.. ఖండించిన ఎమ్మెల్సీ విజయశాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) భార్య అన్నా లెజినోవా ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సింగపూర్ అగ్ని ప్రమాదం (Singapore fire accident)లో తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి భయపడటంతో.. భారత్ కు వచ్చిన వెంటనే ఆమె తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. అయితే ఓ క్రిస్టియన్ అయి ఉండి అన్నా లెజినోవా (Anna Lezhinova) తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆమెను ట్రోల్ (troll) చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తలనీలాలు సమర్పించుకోవడంతో అది నచ్చని కొంతమంది వ్యక్తులు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. కాగా ఇలా చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ టాలీవుడ్ నటి విజయశాంతి (Vijayashanti) ఖండించారు.

ఈ సందర్భంగా ఆమె తన ఎక్ (Twitter)లో ఇలా రాసుకొచ్చారు. "దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని (Hindu religion) విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవాపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమల (Tirumala)లో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. భారత హిందూ సంప్రదాయాన్ని (Indian Hindu tradition) గౌరవించిన అన్నా లెజినోవాని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు." అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) అగ్ని ప్రమాదం నుంచి గాయపడిన తర్వాత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటి ఫొటోలపై కొందరు సోషల్ మీడియా (Social media) వేదికగా ట్రోల్ చేశారు. అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.



Next Story

Most Viewed