- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ..! కాకినాడలో భారీగా పోలీసుల మోహరింపు
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో పోలీసులు మంగళవారం కాకినాడ భానుగుడి సెంటర్‌లోని ఆయన నివాసంలో ఆకస్మిక సోదాలు చేపట్టారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన అనంతబాబు అక్కడినుంచి పరారయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కాకినాడలో భారీగా పోలీసుల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సాక్షుల ఫిర్యాదుతో కదలిక..
సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక సాక్షులైన దుర్గాశివప్రసాద్, మణికంఠ, వెంకటేశ్, పవన్‌కుమార్.. తమను అనంతబాబు బెదిరిస్తున్నారని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు 20 మందికి పైగా సిబ్బందితో ఆయన అపార్ట్‌మెంట్‌కు వెళ్లగా, అప్పటికే ఆయన వెళ్లిపోయారు.






