చంద్రబాబుకు వయసు మీద పడ్డా.. బుద్ధి మారలేదు: పేర్ని నాని

by Disha Web Desk 16 |
minister Perni Nani
X

దిశ, వెబ్ డెస్క్: మచిలీపట్నం ప్రజాగళం సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నానిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పేర్ని నానిని బూతులు నాని అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని గురువారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వయసు మీదపడ్డా.. బుద్ధి మారలేదని ఎద్దేవా చేవారు. చంద్రబాబు, పవన్‌ను తిట్టడానికే తనకు మంత్రి పదవి ఇచ్చారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. తానెప్పుడు పవన్ కల్యాణ్‌, చంద్రబాబుపై బూతులు మాట్లాడలేదన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. చంద్రబాబు రాజకీయాలు, అసత్యాలపై మాత్రమే విమర్శలు చేశానని.. కానీ వ్యక్తిగతంగా బూతు వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. చంద్రబాబు బొంకు మాటలు, ఇచ్చిన హామీలపై వీడియో క్లిప్పింగ్స్ చూసుకోవచ్చని పేర్ని నాని విమర్శించారు.

చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు అర్ధరహితమని ఆయన కొట్టిపారేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బందరు రూపు రేఖలు మారిపోయాయని చెప్పారు. బందరు పోర్టు శంకుస్థాపన.. చంద్రబాబు దగా కోరు స్టంట్ అని విమర్శించారు. తన కుమారుడు గంజాయి అమ్ముతున్నాడని ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శిరోముండనం కేసు 1996లో జరిగితే ఇప్పుడు వైసీపీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తోట త్రిమూర్తులు ఏ పార్టీలో ఉన్నారో గుర్తు తెచ్చుకోవాలని పేర్ని నాని సూచించారు.

Next Story

Most Viewed