పార్టీ మారడంపై ఎమ్మెల్యే మానుగుంట స్ట్రాంగ్ రియాక్షన్

by Disha Web Desk 16 |
పార్టీ మారడంపై ఎమ్మెల్యే మానుగుంట స్ట్రాంగ్ రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారని.. ఈ మేరకు నారా లోకేశ్‌తో ఆయన భేటీ అయ్యారనే ప్రచారం వైరల్ అయింది. దీంతో ఈ ప్రచారంపై ఆయన స్పందించారు. తాను నారా లోకేశ్‌తో భేటీ కాలేదని తెలిపారు. టీడీపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాగుంట ఖండించారు. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తనపై కావాలనే పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి దుష్ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని వైసీపీ శ్రేణులు, పార్టీలకు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed