ఒంగోలులో పోటీ చేసినా, చేయకపోయినా ఆ పని చేసి తీరుతా: బాలినేని

by Disha Web Desk 16 |
ఒంగోలులో పోటీ చేసినా, చేయకపోయినా ఆ పని చేసి తీరుతా: బాలినేని
X

దిశ, వెబ్ డెస్: ఒంగోలు నుంచి తాను పోటీ చేసినా, చేయకపోయినా పేదలకు పట్టాలు పంపిణీ చేసి తీరుతానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల నుంచి తాను రూ. 8 లక్షలు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ అది నిజమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఈ నెల 20న ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. అయితే పట్టాల పంపిణీని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని కోర్టులో పిల్ వేశారని, వారికి ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సీఎం జగన్ నిధులు కేటాయించారని బాలనేని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed