తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి రోజా ఫోటోగ్రాఫర్

by Disha Web Desk 21 |
తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి రోజా ఫోటోగ్రాఫర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ నిబంధనలు ఉల్లంఘించారు. మంత్రి ఆర్‌కే రోజా గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెతోపాటు తన వ్యక్తిగత ఫోటో గ్రాఫర్ స్టెయిన్‌ను కూడా తీసుకువచ్చారు. అయితే ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్‌ స్టెయిన్‌ అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో గొల్లమండపం ఎక్కారు. అయితే స్టెయిన్ మెడలో అన్యమత గుర్తు ఉన్న గొలుసు ఉండటాన్ని భక్తులు గమనించారు. దీంతో స్టెయిన్ పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ఆర్‌కే రోజా తన పర్సనల్ ఫోటో గ్రాఫర్ స్టెయిన్‌ను ఆలయంలోకి తీసుకురావడంపై మండిపడ్డారు. మంత్రి రోజా ఇవేమీ పట్టించుకోకుండా శ్రీవారి ఆలయం వద్ద ఫొటోలు తీసుకోవడంలో నిమగ్నమవ్వడంతో భక్తులు మండిపడ్డారు. ఇకపోతే తిరుమల కొండపై అన్యమత గుర్తుల ప్రదర్శనపై నిషేధం ఉంది. అది తెలిసినప్పటికీ మంత్రి ఆర్‌కే రోజా తన పర్సనల్ ఫోటో గ్రాఫర్‌ను తిరుమలలోకి తీసుకురావడం పట్ల హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ విమర్శలు

తిరుమలలో మంత్రి ఆర్‌కే రోజా పర్సనల్ ఫోటోగ్రాఫర్ వ్యవహారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటంతో టీడీపీ ట్విటర్ వేదికగా స్పందించింది.‘రోజక్క తిరుమలకు ఎందుకు అన్ని సార్లు వెళ్తుందో ఇప్పుడు జనానికి ఒక క్లారిటీ వచ్చింది. నిబంధనలకు వ్యతిరేకంగా మెడలో శిలువ లాకెట్ ధరించి, ఏకంగా తిరుమల గొల్ల మండపం ఎదురుగా నిల్చుని హల్ చల్ చేస్తున్న ఇతనెవరో కాదు. రోజక్క పర్సనల్ ఫోటోగ్రాఫర్. మీకర్ధమవుతుందా?’’ అంటూ టీడీపీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

Next Story

Most Viewed