‘కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం’.. ఎన్నికలకు ముందే జోస్యం చెప్పిన మంత్రి

by Disha Web Desk 19 |
‘కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం’.. ఎన్నికలకు ముందే జోస్యం చెప్పిన మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి పెద్ది రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సొంత ఇలాకా అయిన కుప్పంలో ఆ సారి ఆయన ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుపై వైసీపీ అభ్యర్థి భరత్ ఘన విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ మీద జరిగిన రాళ్ల దాడి ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రియాక్ట్ అయ్యారు. జగన్‌పై రాళ్ల దాడి ఘటన వెనక చంద్రబాబు మనుషులు ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ కేసు విచారణ వేగంగా జరుగుతోందని.. త్వరలోనే అందరి పేర్లు బయటకు వస్తాయని హెచ్చరించారు. చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజే చేయడం అలవాటేనని ఎద్దేవా చేశారు. కానీ చంద్రబాబులా సర్వేలను మేనేజ్ చేయడం తమకు తెలియదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తోందని.. జగన్ మరోసారి ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తోన్న సీఎం జగన్‌పై విజయవాడలో రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇవాళ సతీష్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు.

Next Story