Minister Nimmala:‘పథకాల రద్దుతో దళితులకు గత ప్రభుత్వం వెన్నుపోటు’.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
Minister Nimmala:‘పథకాల రద్దుతో దళితులకు గత ప్రభుత్వం వెన్నుపోటు’.. మంత్రి నిమ్మల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: గత వైసీపీ(YSRCP) ప్రభుత్వ హాయాంలో దళితుల సంక్షేమ పథకాలను మాజీ సీఎం జగన్ రద్దు చేసి వారికి వెన్నుపోటు పొడిచారని మంత్రి నిమ్మల రామానాయుడు(minister Nimmala Ramanaidu) విమర్శించారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ‌ హ‌యాంలో ఎస్సీ స‌బ్ ప్లాన్‌ను స‌మ‌ర్ద‌వంతంగా అమ‌లు చేస్తే, ఆ త‌రువాత వ‌చ్చిన వైసీపీ పాల‌న‌లో ఎస్సీ స‌బ్ ప్లాన్ నిధుల‌ను కూడా దారి మ‌ళ్ళించారని విమ‌ర్శించారు. నేడు(డిసెంబర్ 6) అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన రక్తదానం చేశారు. గత 18 ఏళ్లుగా అంబేద్కర్ వర్ధంతి రోజు తమ తండ్రి పేరుతో ఉన్న ధర్మారావు ఫౌండేషన్ పేరిట రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాను రక్తదానం చేయడం ఇది 24వ సారి అని తెలిపారు. అంతకుముందు ఆసుపత్రిని తనిఖీ చేసి రోగుల యోగక్షేమాలు ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేద్క‌ర్(Dr.BR Ambedkar) ఆశ‌యాల‌ను తూచా త‌ప్ప‌కుండా టీడీపీ అమ‌లు చేస్తుంద‌న్నారు. దేశంలో మొద‌టి సారిగా ద‌ళిత వ్య‌క్తి జీఎంసీ బాల‌యోగిని లోక్ స‌భ స్పీక‌ర్ గానూ, ప్ర‌తిభా భార‌తిని శాస‌న స‌భ స్పీక‌ర్‌గా చేసిన ఘ‌న‌త కూడా టీడీపీ దేన‌ని తెలిపారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఛీప్ సెక్ర‌టరీగా, ద‌ళిత బిడ్డ కాకి మాధ‌వ‌రావును, ఎస్సీ క‌మీష‌న్‌ను ఏర్పాటు చేసి జస్టిస్ పున్న‌య్యను నియ‌మించ‌డం ద్వారా అంబేద్క‌ర్ స్పూర్తితో నాడు చంద్ర‌బాబు(CM Chandrababu) ప‌ని చేశారు అని గుర్తు చేశారు. ఇంక నేష‌న‌ల్ ఫ్రంట్ చైర్మ‌న్‌గా నాడు ఎన్టీఆర్ ఉండ‌గానే అంబేద్క‌ర్‌కు భార‌త‌ర‌త్న ఇచ్చి గౌర‌వించారు అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed