- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
‘త్వరలో ఏపీ వ్యాప్తంగా కూల్చివేతలు’.. మంత్రి నారాయణ సెన్సేషనల్ కామెంట్స్
దిశ,వెబ్‌డెస్క్: రేపు (బుధవారం) స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) మచిలీపట్నంలో పర్యటిస్తారని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలో నేషనల్ లా కాలేజ్(National Law College), డంపింగ్ యార్డ్(Dumping Yard), టీటీడీ(TTD) కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు విజయవాడలో అల్లకల్లోలం సృష్టించాయన్నారు.
ఈ నేపథ్యంలో వర్షపు నీటి(Rain Water) కాలువ ఆక్రమణలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. బుడమేరు(Budameru) ఆక్రమణల వల్ల విజయవాడకు(Vijayawada) భారీ వరద(Heavy Flood) వచ్చిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆపరేషన్ బుడమేరు(Operation Budameru) మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు(Government places), చెరువులు(ponds), కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టి వారైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించి అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.