విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటన.. కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం

by Ajay Maddhiboyina |

మంత్రి లోకేష్ విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటన.. కార్మిక సంఘాల నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం
X

దిశ‌, వెబ్ డెస్క్: మంత్రి లోకేష్ విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషాద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడానికి తాము రాలేదని చెప్పారు. ఎక్స్ గ్రేషియా ఒక్కటే కాదని, కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించారు. రూ.15వేల కోట్ల ప్యాకేజీ తెచ్చి ప్రైవేటీకరణను ఆపేశామని అన్నారు. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన వెంటనే సీఎం సహా అందరూ అలర్ట్ అయ్యారని చెప్పారు. 24 గంటల్లోనే రూ.25 లక్షల పరిహారాన్ని బాధితుల అకౌంట్ లో వేస్తున్నామని హామీ ఇచ్చారు. కార్మిక కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. జగన్ కు సమాధానం చెప్పేందుకు తాము పనిచేయడంలేదని, తెలుగు ప్రజల సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే.

Next Story