ఒక డ్రీమ్ లేదు.. స్కీమ్ లేదు..చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్

by Disha Web Desk 16 |
ఒక డ్రీమ్ లేదు.. స్కీమ్ లేదు..చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు పేరున ఒక డ్రీమ్ లేదని, ఒక స్కీమ్ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో చంద్రబాబుకు సొంతిళ్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పారు. విశాఖ పరిపాలనా రాజధాని కావాలనేదే తమ ఆకాంక్ష అని, అలా జరిగితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖ రాజధానిగా చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత మామనే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని తాము ఏవిధంగా సంభోదించాలని ప్రశ్నించారు. తమ అధినేత సీఎం జగన్‌పై చంద్రబాబు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నాయకత్వాన్ని ప్రజలు సమర్థిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు.

Next Story