Fire accident: నడి సముద్రంలో చేపల బోటులో అగ్ని ప్రమాదం.. ఆరా తీసిన మంత్రి అచ్చెన్నాయుడు

by Mahesh |
Fire accident: నడి సముద్రంలో చేపల బోటులో అగ్ని ప్రమాదం.. ఆరా తీసిన మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ‌పట్టణం(Visakhapatnam)లోని నడి సముద్రంలో చేపల బోటులో ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం (Fire accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో బోటులో మొత్తం 8 మంది చిక్కుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు(Minister Achennaidu) స్పందించారు. అలాగే ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారుల పరిస్థితి గురించి మంత్రి ఆరా తీశారు. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులు అంతా సురక్షితంగా ఉన్నారని మంత్రికి అధికారులు తెలిపారు. అనంతరం ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే తరచూ చోటు చేసుకునే అగ్ని ప్రమాదాలు, వాటి జాగ్రత్తలపై.. మత్స్యకారులకు అవగాహన కల్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు.

Advertisement

Next Story