మీడియాకు అనుమతి నిరాకరణ.. దద్దరిల్లిన కౌన్సిల్ సమావేశం

by srinivas |
మీడియాకు అనుమతి నిరాకరణ.. దద్దరిల్లిన కౌన్సిల్ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మూడేళ్లుగా మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో మేయర్‌ను టీడీపీ కార్పొరేటర్లు నిలదీశారు. వెంటనే అనుమతించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మీడియాపై కక్ష సాధించిందని మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశానికి విజయవాడ టీడీపీ ఎమ్మెల్యేలకు ఎంపీకి సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు సమాచారం ఇవ్వలేదో వెంటనే సమాధానం చెప్పాలని మేయర్‌ను నిలదీశారు. ఈ నేపథ్యంలో సమావేశం రసభాసగా మారింది. ఈ క్రమంలో వైసీపీ కార్పొరేటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభను మేయర్ వాయిదా వేశారు.Next Story

Most Viewed