రాష్ట్రంలో టెంపుల్ టూరిజం సర్క్యూట్ల అభివృద్ధికి చర్యలు

by Disha Web Desk 22 |
రాష్ట్రంలో టెంపుల్ టూరిజం సర్క్యూట్ల అభివృద్ధికి చర్యలు
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో దేవాదాయశాఖ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌కే రోజా వెల్లడించారు. ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో ఇరు శాఖలు సమీక్షా సమావేశం నిర్వహించాయి. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఇరువురు మంత్రులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దేశంలోని అధిక దేవాలయాలు గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన అనేక దేవాలయాలు ఉన్నాయని వాటిని ఆధ్యాత్మికంగాను.. పర్యాటక పరంగాను పర్యాటకులను ఆకర్షించే రీతిలో అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

దీనిలో భాగంగా మొత్తం 16 టెంపుల్ టూరిజం సర్క్యూట్లను గుర్తించి వాటికి రేటింగ్ ఇవ్వాల్సిందిగా ప్రజలు, భక్తులు, పర్యాటకులు అభిప్రాయాలను ఆన్లైన్ ద్వారా కోరగా వాటిలో 5 సర్క్యూట్లకు అత్యధిక రేటింగ్‌లు ఇచ్చారని ఉప ముఖ్యమంత్ర కొట్టు సత్యనారాయణ తెలిపారు. అత్యధిక రేటింగ్‌లు వచ్చిన వాటిలో విజయవాడ నుండి పంచారామ యాత్ర, విజయవాడ నుండి అష్టశక్తి యాత్ర, విజయవాడ నుండి త్రిలింగ యాత్ర, తిరుపతి నుండి కృష్ణదేవరాయ యాత్ర, తిరుపతి నుండి గోల్డెన్ ట్రయాంగిల్ యాత్ర సర్క్యూట్లకు అత్యధిక రేంటింగ్లు వచ్చాయని స్పష్టం చేశారు. ఈ ఐదు సర్క్యూట్లను ముందుగా త్వరలో ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఆయా రూట్లలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలను అనుసంధానిస్తూ ఈటెంపుల్ టూరిజం సర్క్యూట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

దేశవిదేశీ పర్యాటకులు ఆకట్టుకునేలా ఏర్పాట్లు : మంత్రి రోజా

రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు ప్రముఖ దేవాలయాలకు ఆలవాలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌కే రోజా పేర్కొన్నారు. టెంపులు టూరిజంలో భాగంగా పర్యాటక ప్రాంతాలను దేవాలయాలను టెంపుల్ టూరిజం సర్క్యూట్లుగా అభివృద్ధి చేయడంతో అటు భక్తులకు ఇటు పర్యాటకులకు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈవిధంగా టెంపుల్ టూరిజం సర్క్యూట్లు ఏర్పాటుతో అటు దేవాలయాలు, ఇటు పర్యాటక ప్రాంతాలను సందర్శించాలన్న కోరిక నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. ఈప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధికి పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో వివిధ పర్యాటక కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నట్టు మంత్రి రోజా మీడియాకు వెల్లడించారు.


Next Story

Most Viewed