మట్టిలో మాణిక్యం.. ఆశా కార్యకర్త తనయుడికి డాక్టరేట్

by Jakkula Mamatha |
మట్టిలో మాణిక్యం.. ఆశా కార్యకర్త తనయుడికి డాక్టరేట్
X

దిశ, నందికొట్కూరు: పల్లెల్లో కూడా మట్టిలో మాణిక్యాలు ఉన్నాయని నిరూపించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. తల్లిదండ్రులు పడ్డ కష్టానికి ప్రతిఫలం అందించాడు. చిన్న వయసులోనే డాక్టరేట్ పొంది తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం నింపాడు.జూపాడు బంగ్లా మండలం తరిగొపుల గ్రామానికి చెందిన కాటేపోగు వెంకటేశ్వర్లు, కాటేపోగు ఎలిశమ్మ కుమారునికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో ఈసీఈ విభాగంలో పరిశోధక విద్యార్థి కాటే పోగు రాజ్ కుమార్ (28) డాక్టరేట్ ప్రధానం చేశారు. కాటేపోగు రాజకుమార్‌కు ప్రొఫెసర్ ఉమామహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో డిజైన్ అండ్ మోడలింగ్ ఫర్ హై స్పీడ్ వీఎల్‌ఎస్‌ఐ సర్క్యూట్ యూజింగ్ త్రు సిలికాన్ వయాస్ అనే అంశంపై పరిశోధన పత్రాలు ఆయనకు సమర్పించారు. తండ్రి ఒక సాధారణ కూలి , తల్లి ఆశా వర్కర్‌గా పనిచేస్తూ.. రాజ్ కుమార్‌ని ఎంతో కష్టపడి ఉన్నత చదువు చదివించారు. వారి కష్టానికి ప్రతిఫలంగా తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం ఎంతో కష్టపడి శ్రమించి ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్,ఎంటెక్, పి హెచ్ డి పూర్తి చేసి అతి చిన్న వయసులోనే డాక్టరేట్ సాధించడం ఎంతో సంతోష దగ విషయమని తల్లిదండ్రులు, కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed