బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు.. సీఐ శివ గణేశ్

by Dishafeatures2 |
బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు.. సీఐ శివ గణేశ్
X

దిశ, మండపేట: బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే కఠిన చర్యలుంటాయని మండపేట టౌన్ ఇన్ చార్జి సీఐ పెద్దిరెడ్డి శివ గణేష్ హెచ్చరించారు. బ్లాక్ మెయిలింగ్ కేసు లో ఏ1 నిందితుడు గాడు సత్యనారాయణ ను పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇన్ చార్జి సీఐ పెద్దిరెడ్డి శివ గణేష్ మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మండపేట కు చెందిన చింతల వీర ప్రసాద్ తన ఇంటిపై మొదటి అంతస్తు నిర్మించుకుంటుంటే రౌడీ షీటర్ గాడు సత్యనారాయణ, ఆంధ్రప్రభ స్టాప్ రిపోర్టర్ సయ్యద్ హుస్సేన్ లు ఫోటోలు తీసి డబ్బులు డిమాండ్ చేశారనే పిర్యాదు పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి ఆడియో టేపులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారంనమోదు చేశామని సీఐ తెలిపారు. ముందుగా ఇల్లు నిర్మించుకునే వారిని చూసి గాడు సత్యనారాయణ ఫోటోలు తీయడం లేదా ఆర్టీఐ లు పెట్టీ బెదిరించడం చేస్తాడన్నారు. అప్పటికి లోంగకపోతే అప్పుడు జర్నలిస్ట్ హుస్సేన్ రంగ ప్రవేశం చేస్తాడన్నారు. ఫోటోలు తీసి సెటిల్మెంట్ చేసుకోవాలని చెబుతాడన్నారు. ఇద్దరూ కలిసే గత కొంత కాలంగా ఈ దందా సాగిస్తున్నారని తెలిపారు.

ఇప్పటి వరకు సుమారు 1000 వరకు ఆర్టీఐ లు పిర్యాదులు చేశారన్నారు. ఈ వివరాలను పురపాలక సంఘం ద్వారా సేకరించి బాధితులందరి నుండి వివరాలు సేకరిస్తామన్నారు. ఇలాంటి దుర్మార్గులను ఏ ఒక్కరూ ఉపేక్షించకుడదన్నారు. ధైర్యంగా బాధితులు ముందుకు వస్తే కేసులు నమోదు చేసి బుద్ది చెబుతామన్నారు. ఎన్ని సంవత్సరాలు క్రితం జరిగిన ఘటన అయినా పరవలేదని, జరిగిన అన్యాయం తన దృష్టికి తీసుకువస్తే తగిన న్యాయం చేస్తామన్నారు. బాధితుల తరుపున పోలీస్ శాఖ పూర్తి అండగా నిలుస్తుందన్నారు. ఇప్పటి వరకు గాడు సత్యనారాయణ పై 16 కేసులు, ఓ రౌడీ షీటర్ నమోదై ఉన్నాయన్నారు. త్వరలోనే పీడీ యక్టును కూడా నమోదు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమాచార హక్కు చట్టం అనేది ఎంతో విలువైనదని, సామాన్యుల పాలిట వజ్రాయుధమని, అయితే దీనిని ఇలా బ్లాక్ మెయిలింగ్ లు చేసే నిమిత్తం కాకుండా సమాజానికి మంచి చేసేందుకు మాత్రమే వినియోగించాలని కోరారు.

Next Story

Most Viewed