Delhi Liquor Scam: లొంగిపోయిన మాగుంట రాఘవ

by Disha Web Desk 16 |
Delhi Liquor Scam: లొంగిపోయిన మాగుంట రాఘవ
X

దిశ, వెబ్ డెస్క్: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవ ఈడీ అధికారుల ఎదుట లొంగిపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రాఘవకు ఢిల్లీ హైకోర్టు 2 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ సవాల్‌పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. రాఘవకు ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్ గడువును కుదించింది. అలాగే జూన్ 12న ఈడీ అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో తీహార్ జైలు వద్ద ఈడీ అధికారుల ఎదుట మాగుంట రాఘవ లొంగిపోయారు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మాగుంట రాఘవ సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా ఉన్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ సహా పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాఘవ లొంగిపోవడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

Amaravati: తెలంగాణపై పవన్ ఫోకస్.. పార్టీ నేతలతో కీలక సమావేశం

Next Story