రాష్ట్రపతితో లోకేశ్ భేటీ : చంద్రబాబు అరెస్ట్, ఏపీలో పరిస్థితులపై ఫిర్యాదు

by Disha Web Desk 21 |
రాష్ట్రపతితో లోకేశ్ భేటీ : చంద్రబాబు అరెస్ట్, ఏపీలో పరిస్థితులపై ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్‌,కేశినేని నాని, రామ్మోహన్ నాయుడులతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఫిర్యాదు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో తన తండ్రి చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని ఎలాంటి ఆధారాలు లేవని అయినప్పటికీ కక్షపూరితంగా తన తండ్రిని అరెస్ట్ చేశారని ఫిర్యాదు చేశారు. అలాగే అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో లోకేశ్‌ను ఏ-14 నిందితుడిగా చేర్చడంపైనా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో కక్షపూరిత రాజకీయం నడుస్తోందని ద్రౌపది ముర్మకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని లోకేశ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని కూడా ఈ సమావేశంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జోక్యం చేసుకోవాలని లోకేశ్ కోరినట్లు తెలుస్తోంది.

Read More..

లోకేష్ కాల్ చేశాడు.. చంద్రబాబు అరెస్ట్‌‌తో మాకేం సంబంధం..? మంత్రి KTR కీలక వ్యాఖ్యలు

Next Story

Most Viewed