- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: దేవినేని అవినాష్

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు తెల్లవారుజామున వైసీపీ మాజీ ఎమ్మెల్యే (Former YCP MLA) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని హైదరాబాద్ పోలీసుల (Hyderabad Police) సహకారంతో విజయవాడ పోలీసులు (Vijayawada Police) అరెస్ట్ చేశారు. ఆయనను స్థానిక ప్రభుత్వ అనుమతులు అనంతరం నేరుగా విజయవాడ (Vijayawada)కు తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ పై దేవినేని అవినాష్ (Devineni Avinash) మండిపడ్డారు. వల్లభనేని వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని.. వంశీపై అక్రమ కేసులు (Illegal cases) పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం (Lokesh Red Book Constitution) నడుస్తోందని విమర్శించారు. మళ్ళీ తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుందని.. నేడు తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు.
2023 ఫిబ్రవరి 20న గన్నవరం (Gannavaram) టీడీపీ ఆఫీస్‌పై దాడి (Attack on TDP office) జరిగింది. ఈ కేసులో వంశీ ఏ71 గా ఉన్నాడు. దీంతో ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. తుది తీర్పు ఈ నెల 20న వెలువడనుంది. కాగా ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేయాలంటే.. ఈ నెల 20 వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండగా.. మరో కేసులో వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి చేసిన వారిలో ఓ వ్యక్తిని కిడ్నాప్ (Kidnap) చేసి.. అతన్ని బెదిరించి.. కోర్టులో ఒప్పుకునేలా చేశారని సత్య వర్ధన్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంశీని (Former MLA Vamsini) ఈ రోజు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆయనకు విజయవాడ పటమట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్ 140(1), 308, 351(5), రెడ్ విత్ 3 (5) కేసులు పెట్టారు. అలాగే ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు (SC-ST Atrocities Case) కూడా పెట్టారు. ఈ కేసుకు సంబంధించిన నోటీసులను పోలీసులు హైదరాబాద్ లోని వంశీ ఇంటికి అంటించి వెళ్లారు. ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్ నుంచి విజయవాడ కు తరలిస్తున్నారు.