లైఫ్‌లైన్‌ ప్రాజెక్టుకు లైఫే లేకుండా చేశారు: Nara Lokesh Tweet

by Disha Web Desk 21 |
లైఫ్‌లైన్‌ ప్రాజెక్టుకు లైఫే లేకుండా చేశారు: Nara Lokesh Tweet
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు వైసీపీ ప్రభుత్వం లైఫే లేకుండా చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బ్రిటిష్‌ పాలన కంటే ఘోరమైన పాలన రాష్ట్రంలో జరుగుతుందని విమర్శించారు. క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా బుధవారం లోకేశ్ ట్వీట్‌ చేశారు.‘భారతదేశ స్వాతంత్ర్య సమర నినాదం క్విట్‌ ఇండియా. 1942 ఇదే రోజున క్విట్‌ ఇండియా అని నినదిస్తే బ్రిటిష్‌ వాళ్లు ప్రజలను జైళ్లలో పెట్టేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్రిటిష్‌ వాళ్లకు మించిన పాలన జరుగుతోంది. ఇప్పుడు మన జన నినాదం ‘క్విట్‌ సైకో జగన్‌ - సేవ్‌ ఏపీ’’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి లైఫ్‌లైన్‌ ప్రాజెక్ట్‌ అయిన పోలవరానికి సీఎం జగన్‌ లైఫే లేకుండా చేశారంటూ ఘాటు విమర్శలు చేశారు. జగన్‌ పాలనలో పాత ప్రాజెక్టుల విధ్వంసం తప్ప కొత్తగా ఒక్క ప్రాజెక్టునూ నిర్మించలేదని లోకేశ్ ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వం తీరుతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని.. నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రశ్నార్థకమైంది అని నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed